ఈ రెండు ఫోన్లు DSLR కెమెరాలతో సమానం, ధర చాలా చవక

ఎటైనా టూర్లకి, షికార్లకి వెళ్ళాలంటే చెతిలో కెమెరా ఉంటేనే అదో తృప్తి. DSLR కెమెరా ఉంటే అందమైన లొకేషన్స్ లో, అందమైన ఫోటోలు తీసుకోవచ్చు. మన మామూలు ఫోన్ కెమెరాలో అందమైన ఫోటోలు రావడం కష్టమే‌. మరి కెమెరా కొనాలంటే కూడా కష్టమే కదా‌. కేవలం ఫోటోల కోసం వేలకు వేలు పెట్టి DSLR కెమెరా ఎంతమంది కొంటారు చెప్పండి‌. మరి మీ ఫోనే DSLR కెమెరా అయిపోతే? ఇలాంటి ఫోన్ కావాలంటే ఇకనుంచి 50 వేలకు పైగా పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం 14,999 రూపాయలకే DSLR కెమెరా అందించే అందమైన ఫోటోలు, అంటే బ్యాక్ గ్రౌండ్ దానికదే బ్లర్ అయ్యి, ఫోర్ గ్రౌండ్ హైలేట్ అయ్యే ఫోటోలు తీసే రెండు చవక స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ఈ రెండిట్లో మూడు కెమెరాలు ఉండటం విశేషం‌. ఒకటి సెల్ఫీ కెమెరా అయితే, రెండు బ్యాక్ కెమెరాలు. ముందు వాటి స్పెసిఫికేషన్స్ చూడండి. ఆ తరువాత మాట్లాడుకుందాం.

Model : Xiaomi MI A1

Price : 14,999 INR
Specifications :

Screen Size – 5.5 inches

Screen pixels – 1080x1920P

CPU – Octa Core 2GHz

Chipset – Qualcomm Snapdragon 625

OS – Nougat 7.1.1 (Stock Android)

RAM – 4GB

Internal Memory – 64 GB

Expandable – 128 GB

4G – YES (VoLTE)
Battery – 3080 mAh

Camera – 12 MP & 12 MP (f/2.2) back and 8 MP front

Video recording – 4K, 1080P, 720P, slow motion