ఈ కారణం వల్లే నేను కాస్టింగ్‌ కౌచ్‌ తప్పించుకున్నాను     2018-05-08   00:07:21  IST  Raghu V

తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రమే కాకుండా అన్ని భాష పరిశ్రమల్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉంది. కొత్త వారు, అవకాశాల కోసం ఎదురు చూసే హీరోయిన్స్‌, నటీమనులు కొన్ని సార్లు కోఆర్డినేటర్లు మరియు దర్శక నిర్మాతలకు తమను తాము అర్పించుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తేనే అవకాశాలు వస్తాయి. ఇండస్ట్రీలో ఎంతో మంది అలా అవకాశాలు దక్కించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే కోరిక మరియు తపనతో పలువురు అలాంటి పని చేయడం జరిగింది. ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్స్‌గా వెలుగు వెలుగుతున్న వారు, ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్స్‌గా పేరు తెచ్చుకున్న వారు కూడా కాస్టింగ్‌ కౌచ్‌కు బలి అయిన వారే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

సినిమాల్లో ఆఫర్ల కోసమే కాస్టింగ్‌ కౌచ్‌కు ఎంతో మంది బలి అవుతున్నారు. అయితే కొందరు మాత్రం కాస్టింగ్‌ కౌచ్‌ బారిన పడకుండా స్టార్స్‌ అవుతున్నారు. అందులో తాను ఒక హీరోయిన్‌ను అంటూ సమంత చెప్పుకొచ్చింది. తాజాగా ‘మహానటి’ చిత్రంలో నటించిన సమంత మీడియాతో మాట్లాడిన సందర్బంగా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడటం జరిగింది. ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ లేదని తాను చెప్పను అని, కాని తాను మాత్రం కాస్టింగ్‌ కౌచ్‌ బాధితురాలిని కాదు అంటూ చెప్పుకొచ్చింది. తాను నటించిన మొదటి సినిమా విజయాన్ని దక్కించుకున్న కారణంగా రెండవ ఆఫర్‌ ఎన్టీఆర్‌తో చేసే అవకాశం దక్కింది. దాంతో తన కెరీర్‌లో వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదని, అవకాశా కోసం వెదుకునే అవసరం రాలేదని చెప్పుకొచ్చింది.