ఇలియానాపై లైంగిక దాడి

సినిమా వాళ్ళు అన్నాక వారికి ప్రైవేట్ లైఫ్ ఉండటం కష్టమైన విషయం. వారి ప్రతి అడుగుని మీడియా గమనిస్తూనే ఉంటుంది, అభిమానులు తెలుసుకుంటూనే ఉంటారు. వారు కాఫీ బాలేదు అన్నా, అది వార్తే. ఈరోజు నిద్రపట్టలేదు అన్నా వార్తే. ఇలా వారి లైఫ్ పూర్తి పబ్లిక్ గా ఉంటుంది. అందుకే జనాల్లోకి రాలేకపోతారు. ఇక సినిమా వారు జనాల్లోకి వస్తే, అందులోనూ హీరోయిన్లు వస్తే ఎలాంటి సంఘటనలు జరుగుతాయో మనకు తెలియనిది కాదు. కొంతమంది ఆకతాయిలు అదే అదనుగా అసభ్యంగా ప్రవర్తిస్తారు. మాల్ ఓపెనింగ్స్ లో, పబ్లిక్ మీటింగ్స్ లో ఎంతమంది హీరోయిన్లపై అసభ్య తాకిడి జరగలేదు?

తాజాగా ఇలియానాకి కూడా ఇలాంటి ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆ విషయాన్ని బయటపెడుతూ ఇలియానా ఇలా ట్వీట్ చేసింది. “మనం ఓ పాడు ప్రపంచంలో బ్రతుకుతున్నాం. నేను ఒక పబ్లిక్ ఫిగర్ (సెలబ్రిటీని). నాకు వ్యక్తిగత జీవితం, సీక్రెట్ లైఫ్ ఉండదని అర్థం చేసుకోగలను. కాని దానర్థం ఒక మగవాడు నాతొ అసభ్యంగా ప్రవర్తించాలి అని కాదు.