ఇది 18 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే చదవండి..! ఎందుకో తెలుసా.? లేదంటే?     2018-05-30   02:53:42  IST  Raghu V

18 సంవత్సరాలు పైబడిన వారు చదివితే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే వారికే ఇది బాగా అర్థం అవుతుంది. తెలుసుకోవాలి కూడా. దయచేసి చదవండి. ఆనందంగా జీవించడం ఎలానో తెలుసుకుంటే మంచిదని నా ఆభిప్రాయం.

ఉదయం 6 గంటల సమయం…….ఆఫీసుకు వెళ్ళాలని లేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ……లేవలేకపోతున్నాను.. ఎందుకో ఏమిటో మరి…… ” ఏమైంది నాకు? ఎందుకు లేవలేకపోతున్నాను ? ” ఒక్క నిమిషం ఆలోచించాను. నిన్న రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన నాకు గుండెలో సమ్మెటతో కొ్ట్టినంత నొప్పి వచ్చింది…స్ప్రుహ లేకుండా పడిపోయాను.తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు…..
కాఫీ కావాలి నాకు……..నా భార్య ఎక్కడ ఉంది. ఎందుకు నన్ను లేపలేదు. ఆఫీసుకు టైం అవుతోంది కదా! నా పక్కన ఎవ్వరూ లేరు. ఏమైంది నాకు? వసరాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు…….ఇంటి బయట చాలా మంది గుంపుగా ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు……అయ్యో! అది నేనే! దేవుడా! నేను చనిపోయానా?బయట చాలా మంది ఏడుస్తున్నారు…..బిగ్గరగా పిలిచాను……..నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి నా పక్కగదిలోకి తొంగి చూశాను…. నా భార్య విపరీతంగా ఏడుస్తోంది. కొడుకును పట్టుకుని…….భార్యను పిలిచాను……..తనకు నా మాటలు వినిపించలేదు……..మరో గదిలోకి వెళ్ళి చూశాను……