ఇది మరీ ఓవర్‌ ప్రవీణ్‌.. ఆ కథ రాజశేఖర్‌తోనా?     2018-06-03   00:35:47  IST  Raghu V

‘చందమామ కథలు’, ‘గుంటూర్‌ టాకీస్‌’ వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించి, జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న ప్రవీణ్‌ సత్తారు చాలా కాలం తర్వాత రాజశేఖర్‌కు ‘గరుడవేగ’ చిత్రంతో కమర్షియల్‌ సక్సెస్‌ను ఇచ్చాడు. ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న కారణంగా మరి కొన్నాళ్ల పాటు రాజశేఖర్‌కు తెలుగు సినిమా పరిశ్రమలో నూకలు ఉన్నాయని అంతా అనుకున్నారు. గరుడవేగ చిత్రం సక్సెస్‌ ఆయన కెరీర్‌ కొన ఊపిరికి ప్రాణం పోసినట్లయ్యింది. మరో వైపు దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు కూడా ఆ చిత్రంతో మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాడు.

ప్రవీణ్‌ సత్తారు సినిమా సక్సెస్‌ అవ్వడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు పలువురు యంగ్‌ హీరోలు క్యూ కట్టారు. భారీ ఎత్తున రామ్‌తో ఒక సినిమాను తెరకెక్కించేందుకు ప్రవీణ్‌ సత్తారు సిద్దం అయ్యాడు. ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసి, సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలాంటి సమయంలో సినిమాను క్యాన్సిల్‌ చేస్తున్నట్లుగా నిర్మాత స్రవంతి రవికిషోర్‌ ప్రకటించాడు. ప్రవీణ్‌ సత్తారు చెబుతున్న బడ్జెట్‌తో తాను సినిమాను తీయలేను అని, అంత స్థాయి రామ్‌కు లేదని, అతడిపై అంతగా ఖర్చు చేస్తే రికవరీ చేయడం కష్టం అంటూ స్రవంతి రవికిషోర్‌ తప్పుకున్నాడు.