ఇక చాల్లే మీ నాటకాలు ! ప్రజలు అంతా చూస్తున్నర్లే     2018-05-18   06:37:28  IST  Bhanu C

అయ్యా ! మాకు ప్రాణం మీదకు వచ్చింది ఆపరేషన్ చేయించుకోవాలి ఆదుకోండయ్యా ..! అలాగే త్వరలో మన ప్రభుత్వం వచ్చేస్తది .. నేను సీఎం అవుతా అప్పుడు చూద్దాం అంటూ ప్రతి సమస్యకు నేను ముఖ్యమంత్రి అయ్యాకే పరిష్కారం అంటూ ఎప్పుడూ కుర్చీ మీద ధ్యాసతో ఉండే జగన్ ఒకవైపు. పార్టీ పెట్టి నాలుగేళ్లు అయినా కనీసం పూర్తిస్థాయిలో పార్టీ నిర్మాణం చేపట్టుకోవడం చేతకాలేదు కానీ మాటలు మాత్రం రీసౌండ్ వచ్చేలా అదరగొట్టే జనసేన అధ్యక్షుడు ఒకవైపు సీఎం పీఠం కోసం పగటికలలు కనేస్తున్నారు.

ప్రత్యేక హోదా కోసం మేమే అలుపెరగకుండా పోరాడేస్తున్నాము అని చెప్పుకునే ఈ ఇరు పార్టీల అధినేతలు అసలు దోషిని వదిలేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని మోదీని మాత్రం ప్రశ్నించే ధైర్యం వీరిద్దరిలో ఎవరికీ లేదు. ఎందుకంటే అది చీకటి ఒప్పందంలో భాగం కనుక నోటికి తాళాలు వేసుకుని కూర్చోవాల్సిందే.