ఇకపై నాన్నతోనే అంటున్న అఖీరా     2018-06-23   02:59:42  IST  Raghu V

పవన్‌ కళ్యాణ్‌ పెద్ద కొడుకు అఖీరా నందన్‌ తన తండ్రి వద్దకు చేరాడు. పవన్‌ కళ్యాణ్‌, రేణుదేశాయ్‌లు విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత అఖీరా మరియు చెల్లి ఆద్యలు రేణు దేశాయ్‌ వద్ద ఉన్నారు. పూణేలో తన తల్లి వద్ద మొన్నటి వరకు ఉంటూ వచ్చిన అఖీరా ఇకపై తన తండ్రితోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రేణుదేశాయ్‌ ప్రస్తుతం పెళ్లికి సిద్దం అయ్యింది. మరో నెల రెండు నెలల్లో రేణుదేశాయ్‌ పెళ్లికి సిద్దం అవుతుంది. ఈ సమయంలోనే అఖీరా తన తండ్రి పవన్‌ వద్దకు చేరడం చర్చనీయాంశం అవుతుంది.

తన తల్లి రేణుదేశాయ్‌ పెళ్లి చేసుకోవడం అఖీరాకు ఇష్టం లేక పోవడం వల్లే ఇలా ఆమె నుండి దూరంగా వచ్చాడు అంటూ కొందరు విశ్లేషిస్తుంటే మరి కొందరు మాత్రం తన తల్లికి పూర్తి స్వేచ్చ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆమె నుండి దూరంగా వచ్చాడని, తన తల్లి పెళ్లి చేసుకున్న తర్వాత తన వల్ల ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు అనే ఉద్దేశ్యంతో అఖీరా తన తండ్రి పవన్‌ వద్దకు చేరి ఉంటాడు అంటూ పలువురు పలు రకాలుగా విశ్లేషించుకుంటున్నారు. మరో వైపు పవన్‌ తన కొడుకు అఖీరాను గతంలో మాదిరిగానే అభిమానంతో, ప్రేమగా చూసుకుంటున్నాడు.