ఆ ఎమ్మెల్యే నన్ను చెరిచాడు..సంచలనం రేపిన సంఘటన     2018-05-30   01:51:05  IST  Raghu V

ఉన్నవ్‌ దారుణం అందరు మర్చిపోక ముందే యూపీలో మరొక దారుణం వెలుగు చూసింది..బీజెపి ఎమ్మెల్యే తనపై అత్యాచారం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన మళ్ళీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది…బిసౌలీ బీజేపీ ఎమ్మెల్యే కుషాగ్ర సాగర్ తనపై పలు సార్లు అత్యాచారం చేశాడని 22 ఏళ్ల యువతి బడౌన్ జిల్లా ఎస్పీ కళానిధికి ఫిర్యాదు చేసింది…దాంతో ఈ విషయం దేశ వ్యాతంగా సంచలమ అయ్యింది..

భాదిత యువతి ఫిర్యాదు ప్రకారం తాను పదహారేళ్ల వయసులో ఉన్నపుడు 2012వ సంవత్సరంలో తన తల్లితో పాటు కలిసి కుషాగ్ర సాగర్ ఇంటికి వెళ్లానని..అయితే ఆ సమయంలో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మరీ అత్యాచారం చేశాడని బాధిత యువతి పోలీసులకు సాక్ష్యాలతో సహా తెలిపిందని పోలీసులు తెలిపారు అయితే

2012 నుంచి 2014 వరకు కుషాగ్ర సాగర్ తనపై పలుసార్లు అత్యాచారం చేశాడని, ఇప్పుడు ఎమ్మెల్యే జూన్ 17వతేదీన మరో యువతిని పెళ్లాడనున్నాడని యువతి వెల్లడించింది.