బరి తెగించిన కామందుడు..తల్లీ కూతుళ్ళపై     2018-05-28   00:33:42  IST  Raghu V

గుంటూరు జిల్లా లో వెలుగు చూసిన మరో దారుణం…రోజు రోజు కి మనిషి అనే వాడు ఎంతటి హీన స్థితికి..దిగజారి పోతున్నాడో అర్థం అవుతోంది..ప్రపంచ దేశాలకి భారత దేశం అంటే ఒక స్పూర్తిగా ఉంటోంది..భారత దేశం అంటేనే సాంప్రదాయాలకి ,విలువలకి..మనుషల మధ్య ఉండే రక్త సంభందాలకి నెలవు అయితే ఎంతో మంది మృగాళ్ళు ఈ భందాలని అపవిత్రం చేస్తున్నారు..రక్త సంభంధం అనుకునే వారిపైనే అత్యాచారాలకి పాల్పడటం ఎంతో ఆందోళనకి గురి చేస్తోంది..మనిషి ఎటువైపు వెళ్తున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది..గుంటూరు జిల్లా దాచేపల్లి సంఘటన మరువక ముందే తాజాగా జరిగిన మరో సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది..

గుంటూరు జిల్లా తెనాలి ముత్తింశెట్టిపాలెంలో మరో బాలికపై కన్నేసిన ఒక కామాందుడు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు..వివరాలలోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన ఓ మహిళ తన భర్త తనని వదిలేసి ఏటో వెళ్లిపోవడంతో ఒంటరిగా కూలి పనులు చేసుకుంటూ ఐదేళ్లుగా తెనాలి ముత్తింశెట్టిపాలెంలో నివసిస్తోంది…అయితే ఈ క్రమంలో ఆమెకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడి సహజీవనం చేస్తోంది…అయితే ఆమెకి ఇద్దరు పిల్లలు వారు టంగుటూరులో చదువుకుంటున్నారు.