ఆమెకి 23 , అతనికి 13 వారిద్దరికీ పెళ్లి .. చివరికి ఏమయిందో చూస్తే షాక్ అవుతారు , తప్పక చూడండి     2018-05-22   02:50:44  IST  Raghu V

బాల్య వివాహాలు జరగకుండా ప్రభుత్వం సరైన అవగాహన సదస్సు లు ఏర్పరచినప్పటికి ఇంకా చాలా గ్రామాల్లో ఇంకా బాల్య వివాహాలు జరుపుతున్నారు , దీని వల్ల చాలా సమస్యలు ఏర్పడుతాయి.

సాధారణంగా బాల్య వివాహాల్లో వధువుకు చిన్న వయస్సు…వరుడు ఆమె కంటే చాలా పెద్ద వయస్సుతో ఉంటారు. అయితే కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన దీనికి భిన్నంగా ఉంది. ఈ పెళ్లిలో పెళ్లి కొడుకు కంటే పెళ్లి కూతురు 10 సంవత్సరాలు పెద్ద కావడం గమనార్హం. అంతేకాదు అసలు ఇలాంటి పెళ్లి చేయడం పెద్ద నేరం కూడా. అయినా మరి అవగాహన లేకో…లేక చట్టాలు ఏం చేస్తుందనుకున్నారో

కానీ…ఇరువర్గాల పెద్దలు ఒక బాలుడిని చిన్నారి పెళ్లికొడుకుగా మార్చేశారు. అసలు కథ ఏంటంటే

కర్నూలు జిల్లా కర్ణాటక సరిహద్దు మండలం కౌతాళం సమీపంలోని ఓ చిన్న గ్రామంలో వారం క్రితం 13 ఏళ్ల బాలుడికి దాదాపు 23 ఏళ్ల యువతితో పెళ్లి జరిగింది. ఇది మారుమూల ప్రాంతం కావడం అక్కడివారికి ఇలా పెళ్లి చేయడం నేరమనే అవగాహన లేకపోవడం వల్ల పెళ్లి మాములుగా జరిగిపోయింది. అయితే ఈ పెళ్లికి హాజరైనవారు ఎవరో సెల్ ఫోన్ లో ఈ పెళ్లి ని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ తరువాత ఇది వైరల్ గా మారింది. దానివల్ల ఈ బాల్య వివాహం విషయం వెలుగులోకి వచ్చింది.