అసలు పూనంకు త్రివిక్రమ్‌ చేసిన ద్రోహం ఏంటీ?     2018-05-26   01:45:58  IST  Raghu V

కొన్నాళ్ల క్రితం కత్తి మహేష్‌బాబు వరుసగా పవన్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శు చేస్తున్న సమయంలో అనూహ్యంగా కత్తి మహేష్‌ను తిడుతూ పూనం కౌర్‌ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. కత్తి మహేష్‌ కూడా ఆమె విమర్శలకు ఘాటుగానే సమాధానం చెప్పాడు. ఆ సమయంలోనే ఆయన కొన్ని కీలక విషయాలను చెప్పాడు. పూనంకు త్రివిక్రమ్‌కు మద్య ఏదో విరోదం ఉందని, ఆ కారణంగానే ఆయన అంటే పూనంకు కోపం అంటూ చెప్పుకొచ్చాడు. అప్పటి నుండి కూడా పూనం ఏం చేసినా, ఏం మాట్లాడినా కూడా త్రివిక్రమ్‌ యాంగిల్‌లో జనాలు ఆలోచిస్తున్నారు.

గతంలో ఒక దర్శకుడు తనను మోసం చేశాడు అని, ఆయనకు పుట్టగతులు ఉండవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పూనం తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. జల్సాలు చేయించి, అజ్ఞాతంలోకి నెట్టేస్తాడు అంటూ, నమ్మక ద్రోహి అంటూ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌ ఖచ్చితంగా త్రివిక్రమ్‌ గురించి అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూనంకు ఆయనపై విరోదం ఉంది, దాంతో పాటు జల్సా మరియు అజ్ఞాతవాసి చిత్రాు త్రివిక్రమ్‌వి కావడం వల్ల కూడా ఆయనపైన పూనం ట్వీట్‌ చేసిందని, నమ్మకద్రోహీ అంటూ కామెంట్స్‌ చేసిందని కొందరు అంచనా వేస్తున్నారు.