అర్జున్ రెడ్డి ముద్దు పోస్టర్ వివాదం, మహిళా సంఘాలు, ఆర్జీవి ఇన్వాల్వ్మెంట్

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. టీజార్ వివాదాస్పదమైంది, ట్రైలర్ వివాదాస్పదమైంది, మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విజయ్ స్పీచ్ తో పాటు, ఆ సినిమా పోస్టర్ కూడా వివాదాన్నే సృష్టించాయి. హీరోహీరోయిన్లు లిప్ లాక్ వేసుకున్న పోస్టర్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడపడితే అక్కడ కనిపిస్తోంది. ఇది సమాజానికి తప్పుడు మెసేజ్ ఇచ్చేలా ఉంది అంటూ కాంగ్రెస్ నేత హనుమంతరావు దీన్ని చించేయడంతో పబ్లిసిటి పీక్స్ కి వెళ్ళింది. ఆ ఫోటోని తన ఫేస్ బుక్ అకౌంట్ లో పెట్టిన విజయ్, తాతయ్య చిల్ అంటూ చురక అంటిస్తే, విజయ్ కి తోడుగా రామ్ గోపాల్ వర్మ కూడా హనుమంతరావుపై కామెడి చేస్తున్నారు.

“అర్జున్ రెడ్డి ట్రైలర్ చాలా బాగుంది. కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే ఎలాంటి స్లో మోషన్ షాట్స్ లేకుండా హీరోలా కనిపిస్తాడు. నేను విజయ్ ని ఏం కోరుకుంటున్నాను అంటే పోస్టర్ చింపినందుకు హనుమంతరావు బట్టలు కూడా చింపేయాలి. కాని అలా చేస్తే హనుమంతరావుని అలా చూసి పసిపిల్లలు భయపడతారేమో. హనుమంతరావు ఆ పోస్టర్ ని ఎందుకు చింపేసారో నాకు అర్థం కావడం లేదు. ఒక అందమైన అమ్మాయి విజయ్ కి ముద్దు పెడుతోంటే కుళ్ళుకున్నాడా, లేక అలాంటి అదృష్టం తనకు ఎప్పటికి దక్కదు అని బాధపడ్డాడా? తాతయ్య (హనుమంతరావు) తన మనవడు, మనవరాల్లను అడగాలి, ఆ పోస్టర్ లో తప్పేముందో. అర్జున్ రెడ్డి మనవలు, మనవరాళ్ళు చూడాల్సిన సినిమా. ఇది తాతయ్యల కోసం తీసింది కాదు. మీ పార్టీ (కాంగ్రెస్) ఆల్రేడి ముసలి అయిపొయింది. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పిల్ల పని వలన వచ్చే ఎలక్షన్స్ లో మనవలు, మనవరాళ్ళు ఎవరు మీ పార్టీకి ఓటు వేయరు” అంటూ తనకు మాత్రమే సాధ్యపడే రీతిలో ఆడేసుకున్నాడు వర్మ.

మరోవైపు కొన్ని మహిళా సంఘాలు కూడా అర్జున్ రెడ్డి పోస్టర్ మీద విరుచుకుపడ్డాయి. దాంతో క్షమాపణలు చెబుతూ హైదరాబాద్ నగరంలో చాలాచోట్ల పోస్టర్స్ తీసి వేయించారు యూనిట్ సభ్యులు. ఏదైతే ఏం, సినిమాకి దొరకాల్సిన పబ్లిసిటి మాత్రం దొరికింది.