అయ్యో... అనుష్కకు ఇంతటి దుస్తితా?    2018-05-18   00:24:13  IST  Raghu V

కెరీర్‌ ఆరంభం నుండి స్టార్‌ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అనుష్క ‘అరుంధతి’ చిత్రంతో స్టార్‌ హీరో రేంజ్‌లో గుర్తింపు దక్కించుకుంది. అప్పటి నుండి కూడా ఈమె నటించిన ప్రతి సినిమాకు భారీ పారితోషికం పుచ్చుకుంటూ వచ్చింది. ఇక ఈమె నటించిన ‘బాహుబలి’ సినిమా దేశ వ్యాప్తంగా అద్బుతమైన ప్రజాధరణ పొందిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈమెకు మరింతగా అవకాశాలు వస్తాయని అంతా భావించారు. అయితే బాహుబలి సమయంలోనే చేసిన ‘సైజ్‌ జీరో’, బాహుబలి తర్వాత చేసిన ‘భాగమతి’ చిత్రాలు ఈమె కెరీర్‌ను కిందకు దిగజార్చాయి. ఆ రెండు సినిమాలు కూడా చెత్త టాక్‌ తెచ్చుకోవడంతో ఈమె పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది.

సైజ్‌ జీరో కోసం బరువు పెరిగిన అనుష్క ఆ బరువును తగ్గేందుకు చాలా సమయం తీసుకుంది. ఇంకా కూడా పూర్తి స్థాయిలో అనుష్క బరువు తగ్గలేదని చెప్పుకోవచ్చు. దాంతో ఈమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. స్టార్‌ హీరోల సరసన ఈమెకు నటించే అవకాశం దక్కడం లేదు. సోలో హీరోయిన్‌గా చేసిన సినిమాలు సక్సెస్‌ను తెచ్చి పెట్టడం లేదు. దాంతో మళ్లీ మొదటి నుండి కెరీర్‌ను మొదలు పెట్టాలని నిర్ణయించుకుంది. అందుకే చిన్న సినిమాలను, చిన్న హీరోలతో చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది. గతంలో గోపీచంద్‌కు జోడీగా రెండు చిత్రాల్లో నటించిన అనుష్క మరోసారి ఆయనతో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.