అమెరికాలో ఏపీ “మహిళా ఎన్నారై” కి అరుదైన గుర్తింపు     2018-06-11   02:08:25  IST  Bhanu C

తాజగా ఏపీ కి చెందినా మహిళా ఎన్నారై కి అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ లూయివిల్‌ లో అరుదైన గుర్తింపు లభించింది..అంధ్రప్రదేశ్ లోని ఆంధ్రా యూనివర్సిటీ లో ఎంబీయే చేసిన ఆమె ఇప్పుడు ఏకంగా అమెరికాలోని లూయివిల్‌ యూనివర్శిటీ కి ప్రెసిడెంట్ అయ్యింది..వివరాలలోకి వెళ్తే ..అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ లూయివిల్‌ 18వ అధ్యక్షురాలిగా ప్రవాసాంధ్ర మహిళ డాక్టర్‌ నీలిమ బెండపూడి నియమితులయ్యారు…ఏపీకి చెందిన ఆమె ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడి పోయింది..

అమెరికాలో పలు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత పదవులు అధిరోహించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ లూయివిల్‌ యూనివర్శిటీ ప్రథమ మహిళా ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. అయితే తోటి ఎన్నారై ఒక యూనివర్సిటీ కి అధ్యక్షురాలిగా ఎన్ని అవ్వడంతో అక్కడే ఉంటున్న తెలుగు ఎన్నారై సంఘాలు ఆమెని ఘనంగా సత్కరించారు.ఆంతేకాదు ఆమెకి కెంటకీ తెలుగు సంఘం గౌరవ సభ్యత్వాన్ని ప్రకటించారు..