అధిక బ‌రువు, డిప్రెష‌న్‌, కీళ్ల నొప్పులు, జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం… స‌బ్జా గింజ‌లు     2018-06-01   01:51:33  IST  Lakshmi P

చియా సీడ్స్… అవేనండీ స‌బ్జా గింజ‌లు. నీటిలో వేసిన కొంత సేప‌టికి జెల్ లా మారిపోతాయి క‌దా. అవే. చూసేందుకు ఈ గింజ‌లు చాలా చిన్న పరిమాణంలో ఉన్న అవి చేసే మేలు అంతా ఇంతా కాదు. కేవ‌లం 3 గ్రాముల స‌బ్జా గింజ‌ల‌ను తీసుకుని వాటిని నీటిలో వేయాలి. 10 నిమిషాల‌కు అవి జెల్‌లా మారుతాయి. అప్పుడు వాటిని నేరుగా అలాగే తిన‌వ‌చ్చు. లేదంటే ఫ్రూట్ స‌లాడ్స్, ప‌ళ్ల ర‌సాలు, మ‌జ్జిగ వంటి వాటితో క‌లిపి తిన‌వ‌చ్చు. ఎలా తిన్నా కూడా స‌బ్జా గింజ‌ల ద్వారా మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక బ‌రువుకు…


అధిక బ‌రువు సమ‌స్య‌తో బాధ ప‌డేవారికి స‌బ్జా గింజలు చ‌క్క‌ని ఔష‌ధం. ఎందుకంటే వీటిని స్వ‌ల్ప ప‌రిమాణంలో తిన్నా చాలు. త్వ‌ర‌గా క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతోపాటు వీటిని తింటే ఎక్కువ స‌మ‌యం ఆక‌లి వేయ‌దు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది.

జీర్ణ స‌మ‌స్య‌ల‌కు…


స‌బ్జా గింజ‌ల‌ను పైన చెప్పిన విధంగా నీటిలో వేసుకుని తింటే దాంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి. ప్ర‌ధానంగా తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ఉండ‌డంతో మ‌ల‌బ‌ద్ద‌కం బాధించ‌దు. గ్యాస్‌, అసిడిటీ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.

గాయాల‌కు…


కొద్దిగా స‌బ్జా గింజ‌ల‌ను తీసుకుని పొడి చేయాలి. దాన్ని గాయాల‌పై వేసి క‌ట్టు క‌డితే అవి త్వ‌ర‌గా మానుతాయి. అంతేకాదు, ఇన్‌ఫెక్ష‌న్ల‌ను కూడా ద‌రి చేర‌నివ్వ‌వు.