అంబానీ కొడుకు పెళ్లి సందడి, పెళ్లి ఏర్పాట్లకి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా?     2018-06-06   01:39:38  IST  Raghu V

ప్రపంచ ధనవంతుల్లో ఒకరు , ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తి రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్‌ అంబానీ , వారి ఇంట్లో ఇప్పటికే పెళ్లి సందడి మొదలయింది. ఇప్పటికే ముఖేష్ దంపతుల కవల పిల్లలయిన పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ, ఇషా అంబానీల నిశ్చితార్థం అయిందన్న విషయం తెలిసిందే. ఇక చిన్న కొడుకయిన అనంత్‌ అంబానీ పెళ్లి కూడా త్వరలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా అంబానీ కుటుంబం యొక్క పెళ్ళి వార్త మరోమారు వార్తల్లోకెక్కింది. ఈ వార్తలకు ప్రధాన కారణం ఆకాష్ అంబానీ యొక్క ఎంగేజ్మెంట్ ఆహ్వాన వీడియో. ఆకాశ్ అంబానీ తన చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతాను అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు. అసలే అత్యంత ధనవంతుడు పైగా వారి కుటుంబం లో పెద్ద కొడుకు పెళ్లి , మరి దేశంలో అంబానీ కుటుంబ పెళ్ళి అంటే మామూలుగా ఉంటుందా! అంచనాలన్నీ ఓ రేంజిలో ఉంటాయి.