అందమైన కనురెప్పల కోసం బెస్ట్ టిప్స్     2018-04-24   01:17:40  IST  Bhanu C

ప్రతి అమ్మాయి ఒత్తైన,అందమైన కనుబొమ్మలు ఉండాలని కోరుకోవటం సహజమే. అయితే కొంత మంది సన్నని కనుబొమ్మలు ఉండాలని థ్రెడ్డింగ్, ఓవర్ ప్లుక్కింగ్ (లేదా) వాక్సింగ్ వంటివి చేస్తూ ఉంటారు. అయితే కొంత మందికి కనుబొమ్మలు బాగా సన్నగా ఉండి నలుగురిలోకి వెళ్ళటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ సహజసిద్ధమైన చిట్కాలను ఉపయోగించి కనుబొమ్మలు ఒత్తుగా, అందంగా మార్చుకోవచ్చు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో విటమిన్ E,ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన కనుబొమ్మలు పెరగటానికి రక్త ప్రసరణను పెంచుతుంది. అందువల్ల రోజుకి రెండు సార్లు కొబ్బరి నూనెను కనుబొమ్మలపై రాసి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేస్తే సరిపోతుంది.

ఉల్లి రసం
జుట్టు పెరుగుదలలో ఉల్లిపాయ బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయను ముక్కలుగా కోసి మిక్సీ చేసి ఉల్లిరసాన్ని తయారుచేయాలి. ఈ రసాన్ని ప్రతి రోజు కనుబొమ్మలపై రాసి పది నిమిషాల తర్వాత చాలాల్ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.