అందముంది … చూపిస్తాను .. నా ఇష్టం అంటోంది

బాలివుడ్ భామ ఇషా గుప్తా గురించి ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఈ బ్యూటి తన ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలు పెట్టడంతో అందరి దృష్టి ఈమెపై పడింది. ఆ తరువాత కొన్ని నగ్న ఫోటోలు కూడా పోస్ట్ చేయడంతో అది కాస్త వివాదమయ్యింది. తనపై వస్తున్న కామెంట్స్ కి స్పందిస్తూ, తానూ మొదటిసారి నగ్నంగా ఫోటోషూట్ చేయలదని, మోడలింగ్ చేసే సమయంలో చేసిందే ఇప్పుడు చేస్తున్నాను, నేను ఎలా ఉండాలో నాకు బయటివారు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ ఇష్టా ఇప్పటికే ఘాటు స్టేట్మెంట్ ఇచ్చింది. అయినా జనాలు ఆగడం లేదు.

ఆమెకి బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి అంట. అసలు నువ్వు భారతీయరాలివేనా, మీ తల్లిదండ్రుల పరువు తీస్తున్నావు అంటూ పర్సనల్ లైఫ్ మీదా కూడా కామెంట్ చేస్తూ వేలమంది మెయిల్స్ పంపించారట. దాంతో ఇషాకి మళ్ళీ కోపం వచ్చింది.