అంతర్మధనంలో మోడీ..ఏపీ పరిణామాలే కొంప ముంచాయా..?     2018-06-01   02:14:26  IST  Bhanu C

బహుశా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని మోడీ అస్సలు ఊహించి ఉండడు..దేశం మొత్తం మోడీ మానియాలో ఉన్న సమయంలో వరుసగా వస్తున్నా పరాజయాలు భంగపాటులు మోడీ పరువుని గంగలో కలిపేస్తునాయి..తిరుగులేని నేతగా తల ఎగరేసుకుని ఉండే మోడీ ఇప్పటి పరిస్థితులకి తల దించుకుని దీల్ఘాలోచనలో పడేలా చేస్తున్నాయి..మోడీ నిరంకుశత్వ పాలన ఎక్కడ తన సీటు జారిపోతుందో అనే భయం తో చేస్తున్న దారుణాలు మోడీ ని ఇప్పుడు అందరి దృష్టిలో విలన్ చేస్తున్నాయి..అందుకు నిదర్సనమే వచ్చిన ఉపఎన్నికల ఫలితాలు

2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవాతో 282 స్థానాలతో పటిష్టంగా కనిపించిన భారతీయ జనతా పార్టీ 2018 వచ్చేసరికి 271 స్థానాలకు పరిమితమైంది…అయితే వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన పది లోక్‌సభ స్థానాలని ఇప్పుడు బీజేపీ పోగొట్టుకోవడం అనూహ్యమైన మలుపుగా చెప్పచ్చు..మోడీ తరువాత అంతటి పేరు సంపాదించిన యోగీ తన రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని గెలిపించుకోలేక పోయారుఅ..అదే విధంగా డిప్యూటీ సిఎం బాధ్యతలు స్వీకరించేందుకు కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా తమ ఎంపీ స్థానాన్ని సాధించుకోలేక పోయారు..ఇలా బీజేపి ఎక్కడికక్కడ కాళీ అయిన తమ స్థానాలని తిరిగి సంపాదించడంలో విఫలం అయ్యారు..